భార్యాభర్తలు సంతోషంగా ఉంటే లైఫ్ అంతా కూడా బాగుంటుంది. భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అప్పుడప్పుడు సర్దుకుపోవడం వలన ఏ పెద్ద సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుంది. భర్తల్లో ఉండే అలవాట్లు భార్యలకు అస్సలు నచ్చవు. అలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. భర్తల చెడు అలవాట్లకి అలవాటు పడడం కష్టం. భర్తలోని కొన్ని అలవాట్లు భార్యలకు ఇబ్బందిగా మారతాయి. భర్తలు చేసే ఈ పొరపాట్లు భార్యలకు అస్సలు నచ్చవు.
సమయం ఇవ్వకపోవడం
కొంతమంది భర్తలు బిజీగా ఉంటారు. భార్యతో సమయాన్ని గడపరు. భార్యాభర్తల సంతోషంగా ఉండాలన్నా, భార్య ప్రేమగా ఉండాలన్నా.. భర్త తన సమయాన్ని కేటాయించాలి. వాళ్ల కోరికలు, సమస్యల్ని తీర్చాలి. కొంచెం సమయం స్పెండ్ చేయాలి.
కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. సరైన కమ్యూనికేషన్ లేకపోతే గొడవలు వస్తాయి. చాలామంది భర్తలు భార్యల మాటని వినరు. కానీ మంచి కమ్యూనికేషన్ తో ఇద్దరూ మాట్లాడుకుంటే అర్థం చేసుకోవచ్చు.
పిల్లలు
పిల్లల పంపకం విషయంలో భార్యకి కచ్చితంగా భర్త సహాయం చేయాలి. కొంతమంది భర్తలు భార్యని చులకనగా చూడడం వాళ్ళకు సహాయం చేయకపోవడం వంటివి చేస్తారు. అలా చేస్తే కూడా భార్యకు కోపం వస్తుంది.
రహస్యాలు
భార్యకు తెలియకుండా ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టడం లేదంటే ఇంకొకరికి ఫేవర్ గా ఉండడం ఇలాంటివి భార్యలకు అసలు నచ్చవు. కాబట్టి ఇటువంటి తప్పులు కూడా చేయొద్దు.
మెచ్చుకోవడం
భార్య చేసే పనులు నచ్చితే మెచ్చుకోవడం చాలా అవసరం. కొంతమంది అసలు భార్య ఎంత రుచికరమైన వంట చేసిన కనీసం మెచ్చుకోరు. అలాంటి భర్తల్ని కూడా భార్యలు ఇష్టపడరు.