పోలీస్ స్టేషన్లో కోడి పంచాయితీ తెరపైకి వచ్చింది. కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టాడు రాకేష్ అనే వ్యక్తి.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ… నానా రచ్చ చేసింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాకేష్‌కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబట్టింది గంగమ్మ. ఈ కోడి పంచాయితీ ఇప్పుడు వైరల్ గా మారింది.
పోలీస్ స్టేషన్లో కోడి పంచాయితీ
కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ
పోలీసులు సర్దిచెప్పే… pic.twitter.com/I9MssgNZbh
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025