కేరళలో కూడా మదనపల్లి తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. దేవుడు ఆదేశించాడు అని భావించి తన ఆరేళ్ల కొడుకుని కిరాతకంగా చంపేసింది ఒక టీచర్. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కేరళలోని పాలక్కాడ్ జిలో షాహినా, సులేమాన్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ముగ్గురిలో చిన్నవాడైన ఆదిల్ కు ఆరేళ్లు. అయితే షాహినా చాలా కాలం నుంచి మదర్సాలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి గా ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది. స్వతహాగా ఆమె కు దైవభక్తి ఎక్కువ.
అదీగాక మదర్సాలో ఉద్యోగం కావడంతో నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడు గురించి బోధిస్తూ బోధిస్తూ ఆమె భక్తిలో తర్వాతి స్టేజ్ కి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి భోజనం చేశాక సులేమాన్ ఇద్దరు పిల్లలతో కలిసి సులేమాన్ ఒక గదిలో నిద్రపోయాడు.. షాహినా చిన్న పిల్లవాడితో కలిసి మరో రూమ్ లో పడుతుంది.. ఈరోజు వేకువజామున నాలుగు గంటల సమయంలో షాహినా ముందుగా ప్లాన్ చేసి కొడుకు నిద్రలేపి బాత్ రూం కి తీసుకెళ్ళింది. దేవుడు ఆదేశించాడు అని భావించి అతని కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తి తీసుకుని అతని గొంతు చీల్చి అతి కిరాతకంగా చంపింది. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమెకు తెలివి వచ్చి తప్పు చేశానని స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి రప్పించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.