ప్రతీ ఒక్కరి జీవితంలో టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ 24గంటలే ఉంటుంది. కానీ కొందరే తమ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు. మిగతా వారందరూ సమయాన్ని వృధా చేసుకుంటూ, ఆ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి వారికోసం మీరెందులో ఎక్కువగా సమయం వేస్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. లేదా మీరు సమయం వృధా చేస్తున్నారని చెప్పడానికి గల సంకేతాలేంటో చూద్దాం.
పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ యూట్యూబ్ ఆనందిస్తున్నారంటే సమయం వేస్ట్ చేస్తున్నట్టే లెక్క. యూట్యూబ్ మీద బిజినెస్ చేసే వారికి ఇది వర్తించదు.
ఏదైనా ఒక పనిచేద్దామని మొదలుపెట్టి, ఆ పని కష్టంగా ఉందని మరో పని చేయాలని పూనుకోవడం.
మీ కంప్యూటర్ లో కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నా ఒక్కదాన్ని కూడా చదవకపోవడం.
పదే పదే ఇది నా తప్పు కాదని చెబుతూ ఉండడం.
చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం. అలాంటి వాటికోసం కొట్టడానికి కూడా సిద్ధపడటం.
మిమ్మల్ని కలవడానికి వచ్చే వారు వారి షెడ్యూల్ ప్రకారంగా కలవడం. అంటే మీ సమయానికి వాల్యూ లేనట్టే కదా!
పెద్దగా క్వాలిటీ ఉద్యోగాలని మీకు ఆఫర్ చేసి, వాటిని మీరు ఒప్పుకోవాలని ఇతరులు అనుకుంటున్నారంటే మీరు మీ జీవితాన్ని సరిగ్గా డ్రైవ్ చేయట్లేదన్న మాట.
టైమ్ వేస్ట్ అవుతుందని గ్రహించి దాని గురించి తెగ బాధపడుతూ ఉండడం. చాలా మంది ఇదే స్టేజిలోనే ఉంటారు. ఇలా ఉన్నవారికి విజయం అంత తొందరగా రాదు.