పెళ్లికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అనుకుని రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకెళ్లారు.. పోయిన సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని బాధితురాలు లబోదిబోమంటుంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ తన సిబ్బందితో కలిసి విచారణ మొదలుపెట్టారు. క్లూస్ టీం ఆధారంగా వేలి ముద్రలు సేకరించారు. నేరస్థులను పట్టుకునేందురు మూడు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు ఒక కేజీ కి పైగా ఉండవచ్చని, వెండి వస్తువులు 10 కేజీలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. చోరీకి గురైన మొత్తం సోత్తు విలువ సుమారు రూ. కోటి రూపాయల వరకు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ భారీ దొంగతనంతో స్థానికులు భయబ్రాంతులకు గురవతున్నారు. చోరీకి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అసలే బంగారం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ సమయంలో ఇంత మొత్తంలో నగదు చోరీకి గురవడంటో బాధిత మహిళ విలపిస్తోంది. నేరస్థులను త్వరితగతిన పట్టుకుని తన సొమ్ము తిరిగి ఇప్పించాలని పోలీసులును కోరింది.