బిగ్ బాస్ ఇంట్లో దయ్యం.. ఆరియానా హడల్..

-

బిగ్ బాస్ రియాలిటీ షో రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవిక్షన్ పాస్ కోసం అవినాష్, అఖిల్ మధ్య పోటీ జరిగింది. అందులో అవినాష్ కి ఒక ఓటు ఎక్కువ పడింది. దాంతో వచ్చే రెండు వారాల్లో ఎప్పుడైనా ఎవిక్షన్ పాన్ ఉపయోగించుకోవచ్చని బిగ్ బాస్ తెలిపాడు. ఈ ప్రాసెస్ లో హారిక చాలా ఎమోషనల్ అయ్యింది.

గతంలో మోనాల్, అవినాష్ లలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాల్సి వచ్చినపుడు మోనాల్ వైపు మొగ్గిన హారికా, ఈ సారి మాత్రం అవినాష్ కే ఓటు వేసింది. అఖిల్ తో మంచి స్నేహం ఉన్నప్పటికీ అవినాష్ కి వేసింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి దయ్యం వచ్చినట్లు చూపించారు. రేపటి ఎపిసోడ్ లో ఆరియానాకి దయ్యం కనిపించినట్లుగా చూపించారు.

ముఖం మొత్తం తెలుపు రంగులో కనిపిస్తూ, అచ్చం దయ్యంలాగే ఏదో కనిపించింది. మరి హౌస్ లో ఉండగా కేవలం ఆరియానాకే ఎందుకు కనపడిందో అర్థం కావట్లేదు. అదీగాక అలాంటి వేషంలో చూడగానే దయ్యం అని ఎందుకు అరిచిందనే విషయం తెలియట్లేదు. సాధారణంగా హౌస్ లోకి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే అనుకుంటారు. కానీ ఏదో ఒక బొమ్మలాగా కనిపించి, అదీ కేవలం ఆరియానాకే కనిపించడమే వింతగా ఉంది.

ఇదంతా కేవలం ప్రేక్షకులకి ఆసక్తి కలిగించడానికే అని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా చప్పగా సాగుతున్న షోని ట్రాక్ మీదకి ఎక్కించడానికి ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని చెబుతున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది నిజంగా దయ్యమేనా, లేక ఆరియానాకి సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version