హమ్మయ్య: క్షణాల్లో కరోనా ను కనిపెట్టేయొచ్చు ఇలా

-

చైనా లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచదేశాలను సైతం వణికించేస్తున్న ఒకే ఒక్క వైరస్ కరోనా. ఇప్పటికే ఈ వైరస్ వల్ల మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,వేల సంఖ్యలో జనాలు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే ఈ వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం లో నానా తిప్పలు పడాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ లక్షణాలు అన్న విషయం ఒక నిర్ధారణకు రావాలి అంటే కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. అయితే ఈ పెద్ద టాస్క్ కు చెక్ పెట్టడానికి లండన్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఈ కోవిడ్-19 ను క్షణాల్లో గుర్తించడానికి న్యూకాజల్ లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం.. బ్రీతింగ్ ద్వారా ఈ కరోనా వైరస్‌ను గుర్తించవచ్చంటున్నారు. ప్రస్తుతం ఈ కరోనా ను గుర్తించాలి అంటే రోగుల లాలాజలాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు జరిపి కరోనా ఉందాలేదా అన్న విషయం తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రకియ మొత్తం పూర్తి కావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. అయితే బ్రీతింగ్ ద్వారా ఈ కరోనా వైరస్‌ను గుర్తించవచ్చంటున్న శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఓ బయో మీటర్‌ను కూడా కనుగొన్నారు. కొత్త ప్రాసెస్ ద్వారా.. కరోనా వైరస్స్‌ సోకిందీ లేనిదీ.. కొన్ని క్షణాల్లోనే కనుగొనవచ్చు. ఈ బయో మీటర్‌ను తయారు చేసేందుకు బ్రీత్ అనలైజర్‌ పని చేసేవిధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తయారు చేశారు.

మద్యం మత్తులో వాహనాదారులను గుర్తించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న ‘బ్రీతింగ్‌ అనలైజర్‌’ లాగే.. ఈ బయోమీటర్ కూడా పనిచేస్తుందట. అయితే ఇందులో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు, ఫ్యాట్‌ మాలెక్యూల్స్‌ ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ కరోనా వైరస్‌ను మాత్రమే కాకుండా.. ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధు మేహం లాంటి జబ్బులను కూడా దీని ద్వారా గుర్తించేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news