కాబోయే అల్లుడితో అత్త అఫైర్‌.. కూతురు ఏం చేసిందంటే..?

-

మానవతా విలువలు మాయమైపోతున్నాయనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో తనకు కాబోయే భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందో కూతురు. భర్త చనిపోయిన ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. డిగ్రీ చదువుతున్న ఆమె కుమార్తె ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లి వారి పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీంతో ఆ యువకుడు తరచూ ప్రేయసి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రేయసి తల్లితో ఏర్పడిన చనువు ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది.

తాను లేని సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చి పోతుండడాన్ని యువతి అనుమానించింది. ఈ క్ర‌మంలోనే ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి కొచ్చిన ఆమెకు బయట ప్రియుడి చెప్పులు కనిపించాయి. లోపలికి తొంగిచూస్తే తన తల్లి, ప్రియుడు సన్నిహితంగా కనిపించారు. దీంతో విస్తుపోయిన ఆమె.. యువకుడి కుటుంబ సభ్యులతోపాటు స్థానికులను అప్రమత్తం చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు అప్పగించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news