అవును మీరు వింటున్నది నిజమే. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ని అదృశ్యం చేసేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ చర్యతో దేశ ప్రజలతో పాటు ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ పనికి ఏపీ రాజధాని పై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానులు ప్రకటించిన కేంద్రం ఏపీ రాజధానిని మాత్రం ప్రకటించలేదు. దీంతో భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఇంతకు ఏపీకి రాజధాని లేకపోవడం ఏంటీ అనుకుంటున్నారా..? కేంద్రం అదృశ్యం కావడమేంటీ అనుకుంటున్నారా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజధానిని అదృశ్యం చేయడం ఏమిటీ అనే అనుమానం కలుగుతుందా..? నిజమేనండీ బాబు. అసలు విషయం చూస్తే.. ఇప్పుడు ఏపీకి రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పవచ్చు.
గత కొంతకాలంగా ఏపీలో రాజధానిపై వాడివేడిగా రాజకీయం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఏపీ రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిగా ఎంపిక చేసి, అక్కడ భూసేకరణ పెద్ద ఎత్తున చేసి, నిర్మాణాలు ప్రారంభించింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి… వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి అమరావతిలో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రాజధానిపై అనుమానాలు నెలకొన్నాయి.
దీంతో రాజకీయ పార్టీల నడుమ ఏపీ రాజధాని అమరావతి వ్యవహరం గరంగరం గా మారింది. ఈ నేపథ్యంలో పులిమీద పుట్ర లాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చర్యతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి రాజధాని లేదని ప్రకటించేసింది. దీంతో ఇప్పుడు దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు విడిపోయిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది.
ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అన్ని రాష్ట్రాలకూ రాజధానులను తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి తప్ప. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం.. అటు నేతలను ఇటు ప్రజలను ఆశ్చర్యం కల్గిస్తోంది. అమరావతి అని వేసినా పెద్ద రచ్చ లేకపోయేది. కేంద్రం చేసిన ఈ పనికి ఏపీకి రాజధాని లేకుండా పోయంది. ఇప్పటి దాకా ఏపీకి అమరావతి రాజధాని అని ప్రచారం జరుగుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ పనితో ఏపీలో రాజకీయ ప్రకంపనలు లేవనున్నాయి.