కొత్త ప్రియురాలితో అడ్డంగా బుక్ అయిన టాప్ క్రికెట‌ర్‌

-

టీమిండియాలో యంగ్ సిసలైన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. అటు త‌న ప‌దునైన ఫేస్ బౌలింగ్‌తో పాటు ఇటు వీర‌బాదుడు బాదే బ్యాట్స్‌మెన్‌గాను తిరుగులేని హీరోగా మారిపోయాడు. అయితే హార్దిక్‌లో ముందు నుంచి ప్లే బాయ్ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌. మోడ్ర‌న్ స్టైల్స్‌తో క‌నిపించ‌డ‌నికే ఎక్కువుగా ఇష్ట‌ప‌డుతూ ఉంటాడు. హార్దిక్ పాండ్యాను ఇష్ట‌ప‌డ‌ని హీరోయిన్లు, మోడ‌ల్స్ ఎవ్వ‌రూ ఉండ‌రు.

ఇక మైదానంలో బౌండ‌రీల మీద బౌండ‌రీలు బాదుతూ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను దోచుకునే ఈ క్రికెట‌ర్ అటు త‌న‌దైన స్టైలీష్ లుక్స్‌తో, మేన‌రిజ‌మ్స్‌తో మగువ‌ల‌ను కూడా ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట‌. ఇంకా చెప్పాలంటే అత‌డి ప్రేమ‌లో మునిగి తేలిన బాలీవుడ్ భామ‌ల లిస్ట్ చాలానే ఉంది. ముందుగా కోల్‌క‌తాకు చెందిన ఓ మోడ‌ల్‌తో డేటింగ్ స్టార్ట్ చేసిన హార్దిక్ ఆ వెంట‌నే ఆమెకు బ్రేక‌ప్ చెప్పేశాడు.

ఆ త‌ర్వాత మ‌రో హ‌ట్ మోడ‌ల్ ఈషా గుప్తాను ప‌డేశాడు. ఆమెతో బ్రేక‌ప్ త‌ర్వాత  బ్రిటీష్ మోడల్ ఎల్లీ అవ్ రామ్.. పరిణీతి చోప్రా.. శిబానీ దండేకర్ ఇలా ఈ లిస్టులోకే ఇప్పుడు కొత్త‌గా సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్ వ‌చ్చి చేరింది. ఆమెను వెంటేసుకుని ఓ హోట‌ల్‌కు వ‌చ్చిన హ‌ర్దిక్ కెమేరాల‌కు అడ్డంగా దొరికిపోయాడు.

ఇంకేముంది హార్ధిక్.. నటాషా కలిసి రెస్టారెంట్ కు నడిచొస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై కొంద‌రు విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ప్రియురాళ్ల‌ను మార్చ‌డంలో హ‌ర్దిక్ పెట్టిన శ్ర‌ద్ధ క్రికెట్‌పై పెట్ట ఉంటే ఈ పాటికి మ‌నోడి కెరీక్ ఎక్క‌డికో వెళ్లేదంటున్నారు.. ఇది నిజం కూడా..!

Read more RELATED
Recommended to you

Latest news