హైకోర్డు: బిడ్డ పుట్టిన తరవాత కూడా.. ప్రసూతి సెలవలు తీసుకోవచ్చు..!

-

తాజాగా కోర్టు ఈ విధంగా తీర్పుని ఇచ్చింది. కోర్టు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అలహాబాద్ హైకోర్టు మహిళా ఉద్యోగులకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. మహిళా ఉద్యోగి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. అలహాబాద్ హైకోర్టు బిడ్డ పుట్టింది కనుక ఆమె కి ప్రసూతి సెలవల ప్రయోజనాలని నిరాకరించలేరు.

చైల్డ్ కేర్ లీవ్ పొందే అవకాశం ఉంది. ప్రసూతి సెలవలు వేరు, శిశు సంరక్షణ సెలవులు వేరు రెండిటికీ కూడా వేరు వేరు ఉద్దేశాలు ఉన్నాయి. రెండు ఒకటి కాదు అని కోర్టు చెప్పింది. ఈ రెండు ప్రయోజనాలను కూడా మహిళా ఉద్యోగి పొందొచ్చు. రెండు వేరు వేరు అని కోర్టు అంది.

అసిస్టెంట్ టీచర్ సరోజ్ కుమారి పిటిషన్ స్వీకరిస్తూ జస్టిస్ అశుతోష్ శ్రీవత్సవ ఈ ఉత్తర్వులని జారీ చేశారు. పిటిషనర్ ప్రాథమిక విద్యాధికారి ప్రసూతి సెలవల కోసం అప్లై చేసింది. బిఎస్ఏ దానిని రిజెక్ట్ చేసింది. బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు ప్రసూతి సెలవుల కోసం ఈమె అప్లై చేసిందని నవంబర్ 14 2022న రిజెక్ట్ చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందని మేటర్నిటీ లీవ్ ఆమె పొందలేదని చెప్పారు. ఇరువురు చెప్పిన తర్వాత కోర్టు బిడ్డ పుట్టిన సరే మళ్ళీ ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news