చాలా మంది మహిళలకి అవాంచిత రోమాలు శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెదవులపై ( పై పెదవి ) ఈ రోమాలు కనిపిస్తూ ఎంతో ఇబ్బందులకి గురిచేస్తూ ఉంటాయి. మగవారికి మీసం వచ్చినట్టుగా కాకపోయినా నూనూగు మీసాలుగా ఆడవారికి కనిపిస్తూ అందవీనంగా ఉంటాయి. అలాంటి వారు బయటకి వెళ్ళాలంటేనే ఎంతో ఇబ్బందిగా అవమానంగా భాదపడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి సమస్యలకి ఎన్నో పరిష్కారాలు సహజసిద్దంగా ఉన్నాయి. కానీ చాలా మంది త్రెడ్డింగ్ వంటి ఆధునాత పద్దతులని ఉపయోగిస్తారు. అయితే వీటివలన చర్మం నొప్పి కలగడమే కాకుండా అసహ్యంగా కూడా కనిపిస్తుంది. నొప్పి లేకుండా, ఎంతో సురక్షితంగా సహజసిద్దమైన పద్దతులని కొంచం ఓపికతో గనుకా పాటిస్తే తప్పకుండా ఈ సమస్య నుంచీ బయటపడచ్చు.
ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార వేయాలి రెండిటిని బాగా కలిపి పెదవిపై రాసి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంగా కడిగేయాలి. తరువాత రోజ వాటర్ పెదవులపై రాసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు రోజు విడిచి రోజు చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు.
ఒక స్పూన్ బంగాళాదుంప రసం తీసుకుని అందులో అరస్పూన్ మైదా పిండి కలుపుకోవాలి. ఇలా కలిపినా మిశ్రమాన్ని జుట్టు ఉన్న పెదవులపై రాసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే రోమాలు మాయం అవుతాయి.
పసుపు కూడా అవాంచిత రోమాలని నివారించడంలో ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. అందుకే స్వచ్చమైన పసుపు తీసుకుని అందులో కొంచం నీళ్ళు పోసి మెత్తగా అయిన తరువాత రోమాలు ఉన్న పెదవి పై అప్లై చేసి సుమారు గంట పాటు ఉంచాలి. ఇలా దాదాపు 40 రోజులు గనుక చేస్తే అవాంచిత రోమాలని సులువుగా తొలగించవచ్చు.