కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. బంగారు ముక్కు పుడకలు అందుకోండి !

వినడానికి కాస్త నమ్మే విధంగా లేకపోయినా ఇది నిజమే. మీరు కనుక గుజరాత్‌లో టీకాలు వేస్తున్నట్లయితే, మీరు కొరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాదు, బంగారంతో చేసిన బహుమతిని అందుకుంటారు. టీకా తీసుకోవటానికి ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా గుజరాత్ రాజ్‌కోట్‌లోని స్వర్ణకారుల సంఘం మహిళలకు బంగారంతో చేసిన ముక్కు పుడకను, అలానే పురుషులకు హ్యాండ్ బ్లెండర్‌ లను వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే అందిస్తోంది.

ఇటువంటి ఆసక్తికరమైన వాగ్దానాలు మనం ఎలక్షన్ సీజన్లో మాత్రమే వింటాము, కాని గుజరాత్ స్వర్ణకారుల సంఘం పురుషులు మరియు మహిళలు ఇద్దరినీ ఆకర్షించడానికి మరియు వ్యాక్సిన్ మీద ఆసక్తి కలిగించడానికి ఈ ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. భారతదేశంలో శుక్రవారం 89,030 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ టెన్షన్ మొదలయిన నేపధ్యంలోనే శనివారం 92,961 కొత్త కేసులు నమోదయ్యాయి.