500 మిలియన్ ఫేస్ బుక్ యూజర్ల డేటా లీక్ ?

ఫోన్ నంబర్లు మరియు ఇతర డేటాతో సహా  500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్  వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక లీకర్ ప్రకటించి సంచలనం రేపాడు. ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలోన్ గాల్ ప్రకారం, ఆ డేటాబేస్ జనవరి నుండి హ్యాకర్ సర్కిల్‌లలో చెలామణి అవుతున్న ఫేస్‌బుక్-లింక్డ్ టెలిఫోన్ నంబర్‌ లు లానే కనిపిస్తుందని పేర్కొన్నారు.

Facebook
Facebook

తక్కువ స్థాయి హ్యాకర్ల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రసిద్ధ సైట్‌లో కొన్ని యూరోల విలువైన డిజిటల్ డేటా అందుబాటులో ఉందని చెబుతున్నారు. అయితే తమకు తెలిసిన కొంత మంది ఫోన్ నెంబర్ లతో పోల్చి చూస్తే అది నిజమే అని అంటున్నారు. అయితే ఈ డేటా “చాలా పాతది” మరియు 2019 ఆగస్టులో పరిష్కరించిన సమస్యకు సంబంధించినదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మెసేజింగ్ సర్వీస్ టెలిగ్రామ్ ద్వారా లీకర్‌ను చేరుకోవడానికి రాయిటర్స్ చేసిన ప్రయత్నం అయితే విజయవంతం కాలేదు.