40 లక్షల నగదు.. 40 తులాల బంగారం అయినా తప్పని వేధింపులు..చివరికి…!

పెళ్లయిన 11 నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలో 40 లక్షల నగదు 40 తులాల బంగారం ఒక ఎకరం పొలం అల్లుడికి కట్నంగా ఇచ్చిన అల్లుడి దాహం తీరలేదు. దాంతో అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మొయినాబాద్ లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన శ్రావణి తో చిలుకూరు కు చెందిన రాజశేఖర్ రెడ్డి కి గత ఏడాది నవంబర్ 27న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రాజశేఖర్ రెడ్డి కి 40 లక్షల కట్నం తో పాటు 40 తులాల బంగారం అదేవిధంగా ఒక ఎకరం పొలం అత్తింటివారు ఇచ్చారు.

కొద్ది రోజులు కలిసిమెలిసి ఉన్న భార్య భర్తలకు కట్నం విషయం లో గొడవలు మొదలయ్యాయి. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ దసరా పండుగ సమయంలో శ్రావణి తల్లి గారికి చెప్పుకుంది. కాగా నిన్న శ్రావణి తల్లి కి ఫోన్ చేసి అమ్మా నేను చనిపోతున్నా అంటూ ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్ కట్ చేసింది. తల్లి తిరిగి ఫోన్ చేసినా ఎత్తలేదు. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తన కూతురు చనిపోయిందని శ్రావణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.