న్యూజిలాండ్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆఫ్గనిస్తాన్ మొదటి పది ఓవర్లు కనీసం పరుగులు ఎక్కువ రాకున్నా వికెట్ కోల్పోకుండా ఆడి ఒక పార్టనర్ షిప్ నమోదు అయితే ఆ తర్వాత వాటంతట అవే పరుగులు వస్తాయి. కానీ ఆఫ్గనిస్తాన్ యాజమాన్యం ఓపెనర్లకు ఏమి చెప్పి పంపించింది తెలియదు. మొత్తానికి తడబడుతూ తడబడుతూ కేవలం 7 ఓవర్ల లోపే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యి డగ్ అవుట్ లో హ్యాపీ గా కూర్చున్నారు. భారీ లక్ష్యాన్ని చేధించే సమయంలో వికెట్లు కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. కానీ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.. ఆ తర్వాత ఓవర్ లోనే ఇబ్రహీం జాడ్రాన్ బౌల్డ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ షాహిది మరియు రహమత్ షా లు ఉన్నారు. వీరిద్దరూ కనీసం 100 వరకు వికెట్ పడకుండా ఆడితే తర్వాత హిట్టర్లు వచ్చి మిగతా పనిని పూర్తి చేస్తారు. మరి కివీస్ బౌలింగ్ ను అడ్డుకుని నిలబడతారా లేదా అన్నది చూడాలి.