వన్ డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు పూణే లో ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. కాసేపటి క్రితమే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగియగా… శాంటో నాయకత్వంలోని బంగ్లా ఆటగాళ్లు నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఆరంభం నుండి ఓపెనర్లు లిటన్ దాస్ మరియు టాంజిద్ ఖాన్ లు చాలా దూకుడుగా ఆడారు.. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 93 పరుగులు జోడించి బంగ్లాకు భారీ స్కోర్ కు బాటలు వేశారు. టాంజిద్ హాసన్ చాలా చక్కగా ఆడి అర్ద సెంచరీ చేసిన అనంతరం కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు గా వెనుతిరిగాడు. ఆ తర్వాత లిటన్ దాస్ మాత్రమే వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేస్తుంటే.. వరుసగా శాంటో (8), మెహిదీ హాసన్ మిరాజ్ (3), తౌహీద్ హ్రిదయ (16) లు అవుట్ అయ్యారు. ఆ తర్వాత లిటన్ దాస్ (66) సైతం అర్ద సెంచరీ పూర్తయ్యాక అవుట్ అయ్యాడు ఆ తర్వాత ముషఫికర్ రహీం (38), మహమ్మదుల్లా (46) లు రాణించి బంగ్లాదేశ్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు.
బుమ్రా వేసిన చివరి ఓవర్ లలో చివరి బంతికి షారిఫుల్ ఇస్లాం సిక్సు కొట్టడంతో బంగ్లా స్కోర్ 256 పరుగులు అయింది. ఇక ఈ స్కోర్ ను ఛేదించడం ఇండియాకు నల్లేరు మీద నడకలాంటిది అని చెప్పాలి.