WORLD CUP 2023: స్టార్క్, హాజిల్ వుడ్, కమిన్స్ లకన్నా “మాక్స్ వెల్” బెస్ట్ బౌలర్ !

-

వరల్డ్ కప్ లో ఈ రోజు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టఫ్ ఫైట్ ఉంటుందని ఊహించ విధంగానే రెండు జట్లు కూడా హోరా హోరీగా పోరాడుతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా మొదటి 25 ఓవర్ల పాటు కంట్రోల్ గా ఆడినా ఆ తర్వాత వరుసగా కీలక సమయంలో వికెట్లు కోల్పోయి భారీ టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచడంలో వెనుకబడింది అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్ మరియు కమిన్స్ లు ఆశించిన విధంగా రాణించడంతో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే.. ఓపెనర్లుగా వచ్చిన బావుమా మరియు డి కాక్ లను 100 కు పైగా పరుగులు చేసే వరకు వీరు అవుట్ చేయలేకపోయారు. కానీ ఆ మ్యాచ్ లో ఆఫ్ స్పిన్నర్ మాక్స్ వెల్ మాత్రం బావుమా మరియు డి కాక్ ఇద్దరినీ అవుట్ చేయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి వహ్వా అనుపించుకున్నాడు.

ఈ ప్రదర్శన తో సీనియర్స్ కూడా మాక్స్ వెల్ స్టార్క్ , హాజిల్ వుడ్ మరియు కమిన్స్ ల కన్నా నయం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news