నాని “హాయ్ నాన్న” నుండి సూపర్ అప్డేట్ !

-

టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న నటులలో సహజ నటుడు నాని ఒకరు. ఇండస్ట్రీ లో చాలా కాలంగా చిన్న స్థాయి నుండి ఎదిగి ఇప్పుడు సాలిడ్ గా ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇతని సినిమాల ఎంపిక అందరికీ నచ్చేలా ఉంటుంది. తాజాగా మృణాళిని ఠాకూర్ తో కలిసి చేస్తున్న ఒక ఫ్యామిలీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ “హాయ్ నాన్న”సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 15న ఉదయం 11 విడుదల చేయడానికి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా హీరో నాన్ని సోషల్ మీడియా వేదికగా నేను నిన్ను నమ్ముతాను.. నువ్వు నన్ను నమ్ము మ్యాజిక్ అవుతుంది అంటూ మెసేజ్ చేశాడు.

కాగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సౌర్యవ్ అనే కొత్త డైరెక్టర్ తెరెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news