ఆస్ట్రేలియా ముందు సఫారీలు ఉంచిన 312 పరుగులు లక్ష్యాన్ని చేధించడానికి ఆపసోఫాలూ పడుతోంది. ముందుగా ఆస్ట్రేలియా బౌలింగ్ లో విఫలం అయ్యి బ్యాటింగ్ కు సరిగా సహకారం లేని పిచ్ పైన కూడా కు 300 పైగా పరుగులు ఇచ్చుకుంది. ఆ తర్వాత ఈ స్కోర్ ను చేధించడంలోనూ తడబాటుకు గురవుతూ ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 5 కీలక వికెట్లు కోల్పోయి దాదాపుగా ఓటమి కోరల్లో చిక్కుకుంది. మార్ష్ ను యన్సేన్ అవుట్ చేయగా, వార్నర్ ను ఎంగిడి బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత మొదలైంది తుఫాన్ లాంటి బౌలింగ్.. రబడా బౌలింగ్ కు వచ్చి పదునైన బౌలింగ్ తో ప్రమాదకర స్మిత్ మరియు ఇంగ్లిష్ వికెట్ లను తీసుకుని ఆస్ట్రేలియా కోలుకోలేని దెబ్బ తీశాడు. రబడా నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థికి సవాలు విసురుతుంటే వారి దగ్గర సమాధానమే లేదన్నట్లు వికెట్లను ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత మహారాజా మాక్స్ వెల్ వికెట్ ను తీసుకుని ఆస్ట్రేలియా ను ఇంకా పాతాళళంలోకి నెట్టేశాడు.
ఈ దెబ్బతో ఆస్ట్రేలియా ఓటమి ఖరారు అయింది. ఇంకా ఏదయినా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియాకు వరుసగా రెండవ ఓటమి తప్పదు.