ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడి రెండింటిలోనూ విజయం సాధించి కంఫర్టుబుల్ గా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. కాగా ఈ రెండు మ్యాచ్ లలోనూ కివీస్ ను టామ్ లాతమ్ లీడ్ చేసి విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ రెండు మ్యాచ్ లకు సీనియర్ ప్లేయర్లు అయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరియు టిమ్ సౌత్ లు గాయాల కారణముగా దూరం అయ్యారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో అక్టోబర్ 13వ తేదీన చెన్నై లో బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ కు ఇద్దరూ ఫిట్ గా ఉన్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ఇక జట్టులోకి వీరిద్దరో వస్తుండడంతో ఇంకా బలంగా తయారుకానుంది.
ఇక వీరిద్దరి స్థానంలో ఎవరిని బెంచ్ కి పరిమితం చేయనున్నారు అన్నది తెలియాల్సి ఉంది. కాగా బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి ఒకటి ఓడింది. మరి తిరిగి రానున్న విలియమ్సన్ రాణిస్తాడా చూడాలి.