వరల్డ్ కప్ కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ కి రాజీనామా చేసిన ఐర్లాండ్ ఆటగాడు… !

-

జింబాబ్వే లో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా 10 జట్లు పోటీ పడగా ఆఖరికి మూడు జట్లు మాత్రమే బరిలో ఉన్నాయి. ఇప్పటికే శ్రీలంక మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించగా, స్కాట్లాండ్ మరియు నెదర్లాండ్ లలో ఒక జట్టు అర్హత సాధించాల్సి ఉంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోవడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇక నేపాల్, అమెరికా, యూఏఈ, ఒమన్, ఐర్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఇక నిన్న జరిగిన వ స్థానం మ్యాచ్ లో నేపాల్ పై విజయం సాధించిన అనంతరం ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రు బాల్బీర్నీ వన్ డే మరియు టీ 20 లకు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతానికి ఐర్లాండ్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ కు కెప్టెన్సీ బాధ్యతలను ఐర్లాండ్ మానేజిమెంట్ అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news