SCO VS NED: గెలిస్తే వరల్డ్ కప్ కు లేకుంటే ఇంటికే !

-

జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఇప్పటికే జట్లు టోర్నీ నుండి ఎలిమినేట్ అయ్యాయి. కాగా ఉత్తమ ప్రదర్శన చేసిన శ్రీలంక వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించింది. మిగిలిన ఒక్క స్థానం కోసం రెండు జట్ల మధ్యన ఈ రోజు పోటీ హోరా హోరీగా ఉండనుంది. స్కాట్లాండ్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్యన ఇంకాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఇరు జట్లు తమ తమ స్థాయిలో మంచి ప్రదర్శనను కనబరుస్తూ వెస్ట్ ఇండీస్ మరియు జింబాబ్వే లాంటి జట్లకు షాక్ ఇచ్చాయి. ఈ రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు మాత్రం టోర్నీ నుండి నిరాశతో వెనుతిరగాల్సి వస్తుంది.

ఇక నెదర్లాండ్ లో విక్రంజీత్ సింగ్, ఓడోడ్, ఎడ్వర్డ్స్, తేజ మరియు వాన్ బీక్ లు కీలక ప్లేయర్స్ కాగా , స్కాట్లాండ్ లో క్రాస్, మెక్ ముల్లెన్, బేరింగుటన్, గ్రీవ్స్ , సోలె లు కీలకంగా మారనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news