మూడో భార్యతో పవన్‌ కళ్యాణ్‌…అమీర్‌ పేట్‌ ఎడిటింగ్‌ అంటూ వైసీపీ కౌంటర్‌ !

-

గతకొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన మూడో భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అంశంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. మూడో భార్యతో పవన్‌ కళ్యాణ్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేసింది జనసేన. అయితే.. దీనిపై వైసీపీ తమ స్టైల్‌ లో కౌంటర్‌ ఇస్తోంది. అమీర్‌ పేట్‌ ఎడిటింగ్‌ అంటూ వైసీపీ కౌంటర్‌ ఇచ్చింది.

వైసీపీకి చెందిన దేవేంద్రరెడ్డి గుర్రంపాటి… దీనిపై స్పందిస్తూ.. ఒక పార్టీ అధ్యక్షుడివైయ్యుండి అమీర్పేట్ ఎడిటింగులు అది కూడా నీ ఆఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడానికి సిగ్గులేదా పవన్ కళ్యాణ్? అయినా కలిసుంటే ఉన్నామని చెప్పు, లేదంటే విడాకులని చెప్పు నీకేమి కొత్త కాదు కదా! అది మానేసి ఈ చిల్లర పనులు ఏంటి? అని ఫైర్‌ అయ్యారు. ఫోటో బాగానే మేనేజ్ చేసావ్ గానీ పవన్ కళ్యాణ్… నిజంగా “కొణిదల అన్నా లేజోనోవా” గారు నీతోనే ఉంటే… మీరు విడాకులు తీసుకోలేదు అన్నది నిజమే అయితే సరదాగా ఒక 30 సెకన్ల వీడియో పెట్టు చూద్దాం!అని సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news