ఈ భూ ప్రపంచం ఎన్నో వింతలు,విశేషాలకు నిలయంగా మారింది. బూమ్మీద మనషులు ఎలగైతే ఉన్నారో గాలి, శక్తీ, దెయ్యాలు కూడా ఉన్నాయని అంటున్నారు..సైన్స్ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు ఏమిటి అని కొందరు నమ్మక పోగా వాటిని కొట్టిపడేస్తున్నారు.మరి కొంతమంది నిజంగా దెయ్యాలు ఉన్నాయని మంత్ర, తంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్షుద్రపూజలు అలాంటివి..అయితే భయంకరమైన దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్న కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..
మెక్సికోకు 17మైళ్ల దూరంలో ఉన్న డాల్స్ ఐలాండ్లో కూడా దయ్యాలు తిరుగుతాయనే నానుడి ఉంది. పాడైపోయిన బొమ్మలు ఈ ఐలాండ్లోని చెట్లకు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయని.. రాత్రి సమయంలో ఇక్కడ నుంచి రకరకాల శబ్దాలు వస్తాయనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ప్రదేశంలో అడుగుపెట్టేందుకు ఎవ్వరూ సాహసించరు.
రొమానియాలో ఉన్న లులియా హసెదు హోస్ కూడా దయ్యాలకు నిలయం అని అక్కడి ప్రజలు భావిస్తారు. లూలియా అనే వ్యక్తి చినిపోయిన తన కూతురి జ్ఞాపకార్థం ఈ ఇంటిని నిర్మించాడని.. ఆ తర్వాత అతడు ఆమె ఆత్మతో మాట్లాడేవాడని స్థానికులు చెబుతారు.. ఇంకా అమెరికా, చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటివి ఉన్నాయని అంటున్నారు.. మన దేశంలో కూడారాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న బంగరథ్ కోట దయ్యాలు తిరిగే ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే పగటి వేళ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశం..చీకటి పడితే చీమ కూడా ఇటు వైపు తిరగదు..ఇలాంటి భయంకరమైన ఎన్నో ప్రదేశాలు భూమ్మిద చాలానే ఉన్నాయి.. రేపు మరో ప్రాంతంలోని వింతల గురించి తెలుసుకుందాం…