weight loss: బరువు తగ్గడానికి సరికొత్త డివైస్.. ఎలా పని చేస్తుందో తెలుసా..?

-

ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. కాని చాలా మంది ఆహారం తీసుకోకుండా ఉండలేరు. ఈజీగా ఆహారానికి టెంప్ట్ అయిపోయి తినేస్తుంటారు. దీని కారణంగా చాలా మంది బరువు సులువుగా పెరిగిపోతున్నారు. అయితే అటువంటి వాళ్ళు బరువు పెరగకుండా ఉండడానికి రీసెర్చర్లు ఒక వెయిట్ లాస్ (weight loss) డివైస్ ని కనుగొన్నారు.

బరువు/weight loss
బరువు/weight loss

దీని వల్ల అది పళ్ళని క్లోజ్ చేసేస్తుంది. దీనితో తినలేరు. చాలా మంది బరువు పెరిగి పోతున్నామని వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ తిండిని కంట్రోల్ చేసుకోలేరు. అటువంటి వారికోసం ఈ డివైస్ బాగా పనికొస్తుంది. అయితే ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బరువు తగ్గడం కోసం సైంటిస్టులు ఒక వెయిట్ లాస్ డివైస్ ని కనుగొన్నారు. ఇది ఎలా పని చేస్తుంది అనే విషయం లోకి వస్తే.. ఇది మీ పళ్ళని మూసేస్తుంది. దీనితో సాలిడ్ ఫుడ్ ఏమీ కూడా తినలేరు కేవలం లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది.

డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ న్యూజిలాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు ఈ కొత్త డివైస్ తీసుకు వచ్చారు. ఇది ఇలా మూసేయడం వల్ల ఏమి తినడానికి వీలవదు. అయితే ఇది శ్వాస మరియు మాట్లాడడంని కట్టి పెట్టలేదు. సోమవారంనాడు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో మీడియాతో ఈ విషయాన్ని చెప్పింది.

ఎవరైతే దీనిని ధరిస్తారో వాళ్ళ యొక్క నోటిని 2mm మాత్రమే తెరవగలరు అని అంది. దీనిని చూసిన చాలా మంది ట్విట్టర్ లో పలు కామెంట్స్ ని చేశారు. ఈ డివైస్ ని ఎందుకు తయారు చేశారు అనే విషయం లోకి వస్తే… ఎవరైతే సర్జరీ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగకరమని అయితే సర్జరీకి ముందు కాస్త బరువు తగ్గాలని అటువంటి వాళ్ళు బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు.

దీనిని పెట్టుకున్న రెండు నుండి మూడు వారాలకి మ్యాగ్నెట్స్ తెరుచుకుంటాయని అప్పుడు తొలగించ వచ్చని చెప్పింది. అయితే ఈ డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ ఉపయోగించడం వల్ల కొన్ని పదాలు పలకలేరు. అదే విధంగా డిస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఒకరి నోరు మూసి వేయడం అన్ని సమస్యలకి సొల్యూషన్ కాదు అని పలువురు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news