కరోనా వైరస్ రావడం ఏమో గాని జనాలకు కొన్ని కొన్ని చర్యలు కంటి మీద కునుకు ఉంచడం లేదు. ఒక పక్క ప్రాణ భయంతో భయపడి చస్తుంటే… మరో పక్క కొందరు వింత చేష్టలతో భయపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొందరు 500 నోట్లను రోడ్డు మీద పడేసారు. వాటిని పట్టుకుంటే కరోనా వస్తుంది అనే భయంతో ఎవరూ తీసుకోలేదు. తాజాగా బీహార్ లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి కరెన్సీ నోట్లను ఇళ్ళ ముందు వేసి చీటీ రాసి భయపెట్టాడు. బీహార్ రాష్ట్రంలోని సహస్ర అనే పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు… ఇంటి గుమ్మం ముందు కరెన్సీ నోట్లు పెట్టాడు. వాటితో పాటుగా ఒక చీటీ రాసి ఉంచాడు. నేను కరోనాతో వచ్చాను… మీరు ఈ నోటు తీసుకోండి లేకపోతే మీ అందరిని వేధిస్తా అంటూ ఒక చీటీ రాసాడు. ప్రతీ ఇంటి ముందు… రూ.20, రూ.50, రూ.100 నోట్లు పెట్టి ఈ లెటర్ రాసాడు.
శుక్రవారం నుంచి ఈ నోట్లు ఇళ్ళ ముందు కనపడటం తో… ముగ్గురు ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… రంగంలోకి దిగిన పోలీసులు… విచారణ ముమ్మరం చేసారు. అందులో ఉన్న చేతి రాత ఆధారంగా చూస్తే ఒక వ్యక్తే ఈ పని చేస్తున్నాడని… కేవలం ఆట పట్టించడానికి ఈ పని చేస్తున్నాడని గుర్తించారు. వెంటనే అతన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని, తేలికగా తీసుకోవద్దని ఇంటి యజమానులు కోరుతున్నారు.