ప్రపంచ వ్యాప్తంగా కరోనా టోటల్ నెంబర్ ఇదే…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్ళీ వేగంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి కాస్త తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 77515 కేసులు నమోదై… మొత్తం కేసుల సంఖ్య 3641204కి చేరుకుంది. కొత్తగా మరో 3802 మంది ప్రాణాలు కోల్పోవడం తో మరణాల సంఖ్యా రెండు లక్షల 50 వేలు దాటింది. ప్రస్తుతం 49627 మంది ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది.

బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో తగ్గింది అనుకున్న కరోనా అత్యంత వేగంగా పెరుగుతుంది. రష్యాలో నిన్న ఒక్క రోజే 10581 కేసులొచ్చాయి. అలాగే బ్రెజిల్ (6697), బ్రిటన్ (3985)లో కేసులు చాలా వేగంగా పెరిగాయి. అమెరికాలో కూడా కరోనా మళ్ళీ పెరుగుతుంది. సోమవారం కొత్తగా 23716 కేసులు రావడంతో మొత్తం అక్కడ మొత్తం కేసులు 1211838 మందికి కరోనా వైరస్ సోకింది.

స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, కెనడా, పెరు, ఈక్వెడార్, సౌదీ అరేబియా దేశాలతో పోటీగా మన దేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి మన దేశంలో. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రాబోయే రెండు వారాల్లో ఏపీలో భారీగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news