జగన్ కి తల నొప్పిగా మారిన జనాల మద్యం పిచ్చి …!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మద్యం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ సర్కార్ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వడంపై టీడీపీ సహ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని విపక్షాలు అన్నీ మండిపడుతున్నాయి. ఏపీలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం కోసం సామాజిక దూరం లేకుండానే జనాలు పోటీ పడిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ గా గ్రీన్ జోన్ లు కూడా రెడ్ జోన్ గా మారతాయని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విషయంలో సిఎం వైఎస్ జగన్ తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. ఇప్పుడు దీనిపై కేంద్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం అమ్మకాల విషయంలో ఏపీ సర్కార్ పక్కా చర్యలు తీసుకోలేదు అని, పరిస్థితిని కనీసం ప్రజలు కూడా అర్ధం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ పోలీసులు కూడా వారిని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు అనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. దీనితో జనాలను కంట్రోల్ చేయలేకపోయారు.

దీనిపై సిఎం వైఎస్ జగన్ కూడా అసహనం వ్యక్తం చేసారు. ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఆపేయాలి అని,ఎవరు అయితే ఒకరి మీద ఒకరు పడ్డారో వారి ఆధారి మీద కేసులు నమోదు చెయ్యాలి అని ఆయన అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. అధికారులు కూడా జనాలు ఒక్కసారే ఇలా రావడం చూసి షాక్ అయ్యారు. మరీ భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రజల వ్యవహార శైలిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఏదైనా జరిగితే ఎవరిని నిందిస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news