ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎంతో పురాతనమైన, విలువైన వజ్రాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి వజ్రాలు భారీగా ధరలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే సరిగ్గా అలాంటి ఓ పురాతనమైన, అత్యంత విలువైన వజ్రాన్ని గత 2 ఏళ్ల కిందట గుర్తించగా, దానికి ఇప్పుడు వేలం నిర్వహిస్తున్నారు. ఆ వజ్రం విలువ తెలిస్తే ఎవరైనా సరే నోరెళ్లబెడతారు.
కెనడాలోని ఒంటారియో అనే ప్రాంతంలో 2018 సంవత్సరంలో విక్టర్ మైన్‌లో ఓ వజ్రాన్ని వెలికి తీశారు. దాన్ని పరీక్షించి చూడగా అది అత్యంత పురాతనమైన వజ్రం అని నిర్దారించారు. అది భూమి ఏర్పడినప్పటి నుంచి ఉందని సైంటిస్టులు ఓ అంచనాకు వచ్చారు. ఆ వజ్రాన్ని 271 క్యారెట్ల ముడి రాయి నుంచి కట్ చేసి వెలికి తీశారు. ఈ క్రమంలో ఆ వజ్రం 102.39 క్యారెట్లు ఉంటుంది. ఇక దాన్ని హాంగ్‌కాంగ్‌లోని సోతిబైలో వేలం నిర్వహించనున్నారు.
కాగా ఆ వజ్రం విలువ సుమారుగా 11 మిలియన్ల నుంచి 33 మిలియన్ల డార్ల మధ్య ధర వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.80.65 కోట్ల నుంచి రూ.241.96 కోట్లు అన్నమాట. ఇక ప్రపంచంలోనే ఈ తెలుపు జాతి వజ్రం అత్యంత అరుదైనది అని ఇది ప్రపంచంలో రెండో అతి పెద్ద వజ్రమని సైంటిస్టులు చెప్పారు. మరి దీనికి ఎంత విలువ వస్తుందో చూడాలి.