ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక కానలిస్ అనే రీసెర్చ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 మూడో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు కొనుగోలు చేసిన ఫోన్లలో యాపిల్‌కు చెందిన ఐఫోన్ 11 మొదటి స్థానంలో నిలవగా, అదే కంపెనీకి చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్ మూడో స్థానంలో, గెలాక్సీ ఎ11 నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక గెలాక్సీ ఎ51, షియోమీ రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 9, గెలాక్సీ ఎ31, రెడ్‌మీ 9ఎ, గెలాక్సీ ఎ01 కోర్ ఫోన్లు ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిలిచాయి.
కాగా కానలిస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ మొదటి స్థానంలో ఉండగా, హువావే రెండో స్థానంలో నిలిచింది. షియోమీ, యాపిల్, వివోలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా లాక్‌డౌన్ అనంతరం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ వేగంగా దూసుకెళ్తుండడం విశేషం.