ప్లాస్టిక్ బాన్ పై థాయిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రధాన దుకాణాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులపై నిషేధంతో థాయ్‌లాండ్ నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంటే, వినియోగదారులు ఆ దుకాణాల నుండి షాపింగ్ చేసే వస్తువులను తీసుకెళ్లడానికి ఇకపై ప్లాస్టిక్ సంచులను ఇవ్వరన్న మాట. దీనికి అక్కడి ప్రజలు కూడా సహకరించడం విశేషం. దీనితో వారు కొత్తగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు.
వాస్తవానికి, వారు తమ కిరాణా సామాను తీసుకెళ్లడానికి వినూత్న మార్గాలను కనుగొన్నారు. కొనుగోలు చేసిన వస్తువులను తీసుకువెళ్ళే౦దుకు గాను షాపులు ఇవ్వకపోవడంతో తమ వద్ద వస్తువులను సరుకులు తీసుకు వెళ్ళడానికి తెచ్చుకుంటున్నారు. కొందరు రైస్ బ్యాగ్ లను వాడుకోవడంతో పాటు పాత బట్టలను కూడా సరుకులు తీసుకు వెళ్ళడానికి వినియోగిస్తున్నారు.
మరి కొందరు అయితే తమ ఇంట్లో ఉన్న చిరిగిపోయిన సోఫాలకు సంబంధించిన క్లాత్ లను బ్యాగ్ లుగా తాయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. మరి కొందరు సరుకులు తీసుకువెళ్ళడానికి తమ ఇంటి దగ్గర నీళ్ళకు ఉపయోగించే వస్తువులను కూడా తీసుకు వెళ్ళడం గమనార్హం. అక్కడి ప్రజలు కూడా ఇందుకు సహకరించడంతో ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుంది.
who’s uncle….. pic.twitter.com/3ah73XC2i1
— siam (@sihamese) January 4, 2020