ఏపీ రాజకీయాలపై జాతీయ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై తాజాగా కధనాలు వచ్చాయి. నాయకులు పరస్పరం చేసుకుంటు న్న విమర్శలు శృతి మించుతున్నాయని, ఇలాంటి తరహా వాతావరణ ఎన్నికల సమయంలోనూ లేదని అంటున్నారు జాతీయ పాత్రికేయులు. విషయంలో కివెళ్తే.. ప్రస్తుతం రాజధాని అంశంపై అధికార, ప్రతి పక్షాల మధ్య తీవ్రమైన యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
సాధారణంగా ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య విమర్శలు కామనే అయినా.. ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత విమర్శలకు తావిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. రాజధానిని తరలించే అధికారం మీకెవరిచ్చారు? అంటూ చంద్రబాబు ఊగిపోతున్నారు. ఇలాంటి విమర్శ లు బాగానే ఉన్నా.. వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలు ఆదిలో కుంపటి రేపాయి. ఓ మంత్రి ఏకంగా `నీ అమ్మ మొగుడు` అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే సమయంలో వాడు-వీడు అంటూ దిగజారి మాట్లాడం కూడా రాజకీయాలను మరింత పలుచన చేసింది.
దీంతో ప్రతిపక్షం టీడీపీ నుంచి కూడా విమర్శల వర్షం ఇదే రేంజ్‌లో కొనసాగడం ప్రారంభమైంది. తాజాగా వైసీపీ నేతలను కుక్కలతో పోల్చడం చర్చకువచ్చింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. అమరావతి ఉద్యమానికి తన చేతి గాజులు ఇచ్చారు. దీనిని టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు.. అప్పట్లో రాజధాని నిర్మాణానికి పైసా కూడా ఇవ్వని భువనేశ్వరి ఇప్పుడు ఏమొహం పెట్టుకుని ఇచ్చారని, పెయిడ్ ఆర్టిస్టుల కోసం త్యాగం చేస్తున్నారని వైసీపీ నాయకులు రోజా తదితరులు విమర్శించారు. దీంతో టీడీపీ నేతలు “కుక్కలు.. భువనేశ్వరిపై మొరుగుతున్నాయి“ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగామారింది.
గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలను సన్నాసులు అన్న సమయంలో తీవ్ర వివాదం ఏర్పడింది. అయితే, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా పోయి.. కుక్కలు.. అని అనడంతో దున్నపోతులు ఎన్ని అరుపులు అరిచినా.. ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు అనడంతో అసలు ఏపీ రాజకీయాల్లో ఇంత దురదృష్ట కర పరిస్థితులు ఏర్పడతాయని అనుకోలేదంటూ.. జాతీయ మీడియా కథనాలు వెలువరించడం ఆసక్తిగా మారింది.