73 కేజీల విభాగంలో చరిత్ర సృష్టించిన రెజ్లర్ ప్రియా మాలిక్

-

హంగేరీ: రెజ్లర్ ప్రియా మాలిక్ చరిత్ర సృష్టించారు. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్ షిప్‌లో ఆమె స్వర్ణం సాధించారు. 73 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె విజయం సాధించారు. శనివారం ఒలింపిక్స్‌లో మీరాభాయి ఛాను రజతం సాధించారు. ఈ రోజు మరో ప్రపంచ వేదికపై ప్రియా మాలిక్ సత్తా చాటడం విశేషం. దీంతో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్ షిప్‌లో ప్రియా మాలిక్ పసిడి సాధించడంపై ప్రశంసలు కొనసాగుతున్నాయి. దేశ కీర్తిని రెపరేపలాడించినందుకు ఆమెకు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేశారంటూ ప్రియా మాలిక్‌కు అభినందనలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news