ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్యాసినో వివాదం తారా స్థాయికి చేరుకుంటుంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. క్యాసినో నిర్వహణ పై సోమవారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ క్యాసినో వివాదంపై మంత్రి కొడాలి నానికి మద్దతు తెలుపు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్యాసినో నిర్వహిస్తే.. తప్పేంటని టీడీపీ నాయకులను ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ పేరుతో టీడీపీ నాయకులు అక్రమాలు నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు.
అలాంటి సమయంలో క్యాసినో నిర్వహిస్తే.. టీడీపీ కి ఎం సమస్య అని అన్నారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జూదం పోటీలు ఉండేవి కాదా అని ప్రశ్నించారు. కనీసం జూదం పై చంద్రబాబు ఆంక్షలైనా పెట్టారా.. అని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే జూదం పై నిషేధం విధించారని గుర్తు చేశారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లి డ్యాన్స్ లు టీడీపీ నాయకులకు కనిపించడం లేదా అని అన్నారు. దమ్ముంటే ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే బెల్లి డ్యాన్స్ లపై టీడీపీ ప్రశ్నించాలని సవాల్ విసిరారు.