ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సంచలన ఆదేశాలు మీద ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ పై ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు చెల్లవని హైకోర్ట్ తన తీర్పులో స్పష్టం చేసింది. మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని చెబుతూనే ఎన్నికల సంఘం విధించిన మీడియాతో మాట్లాడకూడదు అనే ఆదేశాలను మాత్రం పాటించాలని పేర్కొంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్నటి నుంచి 21వ తారీకు వరకు హౌస్ అరెస్ట్ లో ఉండాలని మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టుకు వెళ్ళగా… ఉదయం నుంచి ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్ మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు ఇచ్చింది.