అమరావతి : విసనకర్రలు, లాంతర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న పిచ్చి ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. అప్పుల్లోనే కాదు.. అధిక విద్యుత్ ధరల్లోనూ దేశంలో ఏపీ టాప్ అని.. విజనరీ నాయకుడికి.. ప్రిజనరీకి ఉన్న తేడా చెప్పడానికి నేడు పెంచిన విద్యుత్ ధరలే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు.
ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ధరలు పెంచకపోవడమే చంద్రబాబు విజన్ అని… విద్యుత్ ఉత్పత్తీ లేక ధరలు పెంచడం నేటి ప్రిజనరీ పనికి మాలిన విధానం అని చెప్పారు. గతంలో దారిద్ర్య రేఖ దిగువ ఉన్న జనాభా సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నించామని.. నేడు వీలైనంత మందిని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. నాడు.. చంద్రబాబు ముందు చూపుతో సోలార్, విండ్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్తులో విద్యుత్ కష్టాలు లేకుండా చేశారన్నారు. తన సహజమైన విధ్వంసం, వికృత ఆనందపు చర్యలతో జగన్ ఆ ఒప్పందాలు రద్దు చేశారన్నారు.