ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన యశస్వి‌ జైశ్వాల్

-

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడుతున్నాడు. దీంతో యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ 12వ స్థానానికి ఎగబాకాడు.సిరీస్‌ ఆరంభానికి ముందు 69వ స్థానంలో ఉన్న జైస్వాల్‌.. ఒక్కో మ్యాచ్‌కు ప్రదర్శన మెరుగు పర్చుకుంటూ ర్యాకింగ్స్‌లో సత్తా చాటుతున్నాడు.ఇక రాంచీ టెస్టులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ 69వ స్థానం దక్కించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news