వైసీపీ లేడీ ఎమ్మెల్యేల ఫైటింగ్‌

అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఫైటింగ్‌ మొద‌లైంది. అది కూడా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య కావడం గమనార్హం. వివ‌రాల్లోకి వెళ్తే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ మధ్య ఆదివారం జ‌రిగిన ఓ కార్యక్రమంలో విబేధాలు తలెత్తాయి. మేడికొండూరు మండలం తురకపాలెంలో మసీదు శంకుస్థాపన కోసం ర‌జ‌నీ, శ్రీదేవి ఇద్ద‌రూ విచ్చేశారు. అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని కార్యక్రమానికి ర‌జ‌నీ రావ‌డంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే వెళ్లిపోయినా స‌హ‌నంతో మసీదు శంకుస్థాపన కార్యక్రమాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ కొనసాగించడం విశేషం. ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయి ముస్లింలను అవమానించారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.