విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆందోళనలు ఉద్రిక్తం అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ అలాగే ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దురదృష్టకరమని అన్నారు.
స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని అమ్మడం సరి కాదని అన్నారు. ఈ నిర్ణయం ఉప సంహరించుకుంటే రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ 49 వేల కోట్లు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. దీని పై వైసీపీ ఎంపీలు అందరం కలిసి కేంద్రం పెద్దలను కలుస్తామని ఆయన అన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని అన్నారు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి అమ్మేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గక పోతే వైసిపి ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తామని పేర్కొన్నారు.