ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. వారు ఎవరో కాదు… పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ.
ఏమీ లేదు ఇటీవల వారు ఇద్దరినీ జగన్ రాజ్యసభ కు ఎంపిక చేసారు. దీనితో నలుగురు బీఫారాలు కూడా తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. మోపిదేవి రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు కాగా… మండపేట నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. ఆ తర్వాత వారి ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కేబినేట్ లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి.
ఇప్పుడు వాళ్ళను రాజ్యసభకు ఎంపిక చేసిన నేపధ్యంలో… రాజీనామా చేయనున్నారు. శాసన మండలి రద్దు చేయడంతో వీరి ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దు అవుతాయి. వారు ఇద్దరు జగన్ కి అత్యంత సన్నిహితులు. దీనితో రాజ్యసభకు పంపించడానికి జగన్ రెడీ అయ్యారు. వీరితో పాటుగా ముఖేష్ అంబాని సూచించిన పరిమల్ నత్వాని అలాగే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసారు.
వీరు ఇద్దరూ ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్న నేపధ్యంలో వారితో ఖాళీ అయిన మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చిలకలూరిపేట నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే విడదల రజనితో పాటుగా మాచర్ల నుంచి విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని కేబినేట్ లోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.