వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అయితే.. తాజాగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… ఏకంగా.. భారత రాజ్యాంగం రాసిన.. అంబేద్కర్ నే టార్గెట్ చేశారు. అంబేద్కర్ కారణంగా… మనకు ఎలాంటి హక్కులు, రాజ్యాంగ హక్కులు రాలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబు జగ్జీవన్ రామ్ సాధ్యం అయ్యాయని… తెలిపారు. మన అందరికీ..బాబు జగ్జీవన్ రామ్ కారణంగానే అన్ని హక్కులు దక్కాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు.. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో… చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అయితే.. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=VDx9dGi2eME