ఈ పేటకు నేనే మేస్తిరి, వైసీపీ ఎమ్మెల్యే రజని మేడం హవా…!

-

విడదల రజని’ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న వాళ్లకు మంచి పరిచయం. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, టీడీపీ సీనియర్ లీడర్ ప్రత్తిపాటి పుల్లారావు ని ఓడించి తన బలం ఏంటో చూపించారు. ఇక మేడం గారికి యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయంగా, ఆర్ధికంగా కూడా మేడం గారు నియోజకవర్గంలో అత్యంత బలవంతులు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మేడం గారి దూకుడు కాస్త ఎక్కువైంది అనే విషయం అందరికి అర్ధమవుతుంది. ప్రజలకు దగ్గరవుతూనే ఆమె అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీరు మంత్రి అయినా సరే ఇది నా నియోజకవర్గం అంటూ మంత్రులను కూడా తన నియోజకవర్గంలో పెత్తనం చెలాయించకుండా ఆమె అడ్డుపడుతున్నారు.

ఇక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సంక్షేమ కార్యక్రమం జరిగినా జగన్ ఓపెన్ చెయ్యాలి లేకపోతే నేనే ఓపెన్ చెయ్యాలి అన్నట్టు ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఇక ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆమె కొన్ని వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఆకస్మికంగా ప్రభుత్వ స్కూల్స్ తనిఖీ చేయడం, పిల్లల హాజరు పట్టిక చూడటం, అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయడం వంటివి చేస్తున్నారు మేడం గారు.

ఏ సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు చేయడంతో అధికారుల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇక షేర్ ఆటోలో ఎంత మంది ఎక్కుతున్నారు…? ఏ వాహనానికి పొగ వస్తుంది…? అనేవి కూడా చూస్తున్నారు. ఇక తన దగ్గరకు ఏదైనా సమస్య వస్తే సదరు అధికారిని అక్కడికే పిలిపించి పరిష్కరించడం మేడం స్టైల్. ఇలా నియోజకవర్గంలో ఆమె హవా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక విపక్షాలను ఆమె విమర్శలతోనే నియోజకవర్గంలో చంపేస్తున్నారు. ఇలా మేడం గారి పెత్తనం పేటలో… ఈ పేటకు నేనే మేస్తిరి అన్నట్టు సాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news