ABN రాధాకృష్ణ ఓ చెత్త నాకొడుకు..ము**డా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇవాళ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. రాధాకృష్ణ అనే వ్యక్తినే వీడియోలు బయటకు రావడానికి కారణమని..మార్ఫింగ్ చేసి.. తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు.
వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రమని.. ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు. ఇప్పటికే, జిల్లా ఎస్.పి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరానని వివరించారు. దీనిపై ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే తెలుగు దేశం పార్టీ కి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పరువునష్టం దావా వేస్తానన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్.