బిగ్ బ్రేకింగ్: రఘురామ కృష్ణం రాజు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై ఏపీ సిఐడి అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాసేపటికి ఆయన నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ…

124 ఐపీసీ ఏ సెక్షన్ కింద రఘురామకృష్ణంరాజు పై కేసు నమోదు చేశారు. నేడు రఘురామ కృష్ణంరాజు పుట్టినరోజు. పుట్టినరోజు నాడే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.