రేవంత్ రెడ్డి మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంకోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకి రేట్ కట్టి వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
బిల్డర్ల నుండి నేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ దందా అని అన్నారు. ఏడాది కడుపు కట్టుకుంటే 40000 కోట్ల దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి బహిరంగనే చెప్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎక్కడ అవినీతి చేయచ్చో రేవంత్ రెడ్డి రీసెర్చ్ చేశారని ఆయన అన్నారు.