ష‌ర్మిల కీల‌క ప్ర‌క‌ట‌న‌..వైటీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఏపూరి సోమ‌న్న‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఇక ష‌ర్మిల పార్టీ స్థాపించిన నాటి నుండి వ‌రుస స‌భ‌లు స‌మావేశాలు నిర్వ‌హిస్తూ తెలంగాణ రాజీకీయాల‌పై ప‌ట్టుసాధిస్తున్నారు. తాజాగా ష‌ర్మిల త‌మ పార్టీ త‌ర‌పున ఏపూరి సోమ‌న్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వైఎస్ ష‌ర్మిల తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌లగిరిలో ప‌ర్య‌టించారు.

ఈ సంధ‌ర్బంగా ఆదివారం ష‌ర్మిల తిరుమ‌ల‌గిరిలో ద‌లిత భ‌రోసా స‌భ‌లో మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా వైటీపీ త‌ర‌పున తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఏపూరి సోమ‌న్న పోటీకి దిగుతార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. తుంగ‌తుర్తి ప్ర‌జ‌లు ఏపూరి సొమ‌న్న‌ను ఆశిర్వ‌దించాల‌ని ష‌ర్మిల కోరారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ నుండి ష‌ర్మిల పార్టీలోకి వ‌చ్చిన ఏపూరి సోమ‌న్న పార్టీలో కీల‌క వ్య‌క్తిగా ప‌ని చేస్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాల్లో ష‌ర్మిల వెంట న‌డుస్తున్నారు.