మాజీ సిఎం గారూ.. నేను కుక్కనే… కాని…!

తనను ‘కుక్క’ అని పిలిచినందుకు కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను బిజెపి నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా శనివారం కౌంటర్ ఇచ్చారు. తాను కుక్కనే అని ప్రజలను అవినీతి పరుల నుంచి రక్షించిన కుక్కను అని పేర్కొన్నారు. అశోక్ నగర్ జిల్లాలోని షాడోరాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన… “కమల్ నాథ్ అశోక్ నగర్ వచ్చి నన్ను కుక్క అని పిలిచారు.

కమల్ నాథ్, నా మాట వినండి. అవును, నేను కుక్కను, ఎందుకంటే ప్రజలు నా యజమాని… కాబట్టి నేను ఎంతో ఆసక్తిగా సేవ చేస్తున్నాను. అవును నేను కుక్కను ఎందుకంటే నేను ప్రజల సేవకుడిని… ఎందుకంటే ఒక కుక్క దాని యజమానిని రక్షిస్తుంది. ఎవరైనా అవినీతి విధానాలను తీసుకువస్తే ఈ కుక్క ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. నేను బహిరంగంగా కుక్క అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అన్నారు.