యోగా..ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయ్యింది.పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ప్రబలుతున్న రోగాల కారణంగా జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది. 80 శాతం మంది జనాలు యోగా, వ్యాయామాలు చేస్తున్నారు.. డైలీ జీవితంలో ఒక భాగం అయ్యాయి.కాగా, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురించి పలు కార్యాక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం.ఈ మేరకు హైదరాబాద్ బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో జరిగిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు దాదాపు పది స్కూళ్లకు చెందిన ఐదు వందల మంది, స్కూలుకు చెందిన 3500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి హాజరయ్యారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి రోజు యోగా చేస్తే విద్యార్థులెంతో ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలు చురుగ్గా ఉంటే అనుకున్న లక్ష్యాలను సాదిస్తారని ఆయన అన్నారు.
అనంతరం సిల్వర్ ఓక్స్ స్కూల్ ప్రిన్సిపల్ సీతామూర్తి మాట్లాడుతూ.. తమ స్కూల్ యాక్టివిటీలో భాగంగా.. ప్రతిరోజూ విద్యార్థులు యోగా చేస్తారని తెలిపారు. వైమానిక దళం కమాండింగ్ ఆఫీసర్ ఎన్ సీసీ గ్రూప్ కెప్టెన్ కేఎం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎన్ సీసీ విద్యార్థులు తప్పకుండా యోగా చేయాలని, దీని వల్ల శారీరికంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ రాజీవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణిమా, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.