టీటీడీ పై మరో పిటీషన్..!

టిటిడి బోర్డు పై ఇటీవలే ఏపీ హైకోర్టు లో వరుసగా పిటిషన్లు దాఖలు అవుతుండడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టిటిడి బోర్డు దేవాలయ నిధులను పక్కదారి పట్టిస్తుంది అంటూ ఎన్నో ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి డిక్లరేషన్ పై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి టీటీడీపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది.

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్లను కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీకి చెందిన బీజేపీ నేత టీటీడీ మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇలా టిటిడిపై రెండోసారి పిటిషన్ దాఖలు కావడం సంచలనం గా మారిపోయింది. అధిక వడ్డీ పేరుతో టీటీడీ బాండ్ల కొనుగోలు సరైనది కాదు అంటూ ఆరోపించిన పిటిషనర్… ఈ క్రమంలోనే టిటిడి నిధులన్ని పక్కదారి పడుతున్నాయి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది.